
కాళేశ్వరం కాల్వ పనుల్లో కదలిక
సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనుల్లో కదలిక వచ్చింది. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రధానంగా భూసేకరణ అడ్డంకిగా ఉండడంతో తాత్కాళికంగా నీటి సరఫరాకు అడ్డుగా ఉన్న కాల్వల్లోని పూడిక తొలగింపు, అర్ధంతరంగా నిలిచిన పైపులైన్ పనులను మొదలుపెట్టారు. ‘సాక్షి’లో ‘కొసముట్టని కాళేశ్వరం’ శీర్షికన గురువారం ప్రచురితమైన కథనానికి నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. కోనరావుపేట మండలం కనగర్తి–సుద్దాల మధ్య కాల్వలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులతోపాటు సుద్దాల వద్ద మల్కపేట రిజర్వాయర్ నీరు మా రుపాకకు వెళ్లేలా పైపులైన్ పనులు చేస్తున్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని వే ములవాడ అర్బన్ మండలం మారుపాక వరకు గోదావరి జలాలు చేర్చాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలతో నీటిపారుల శాఖ ఈఈ కిశోర్ పనులు ప్రారంభించారు. మధ్యమానేరు నుంచి మల్కపేట వరకు 12.035 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తయ్యాయని, కాంక్రీట్ లైనింగ్, సర్జిపూల్, పంప్‌హౌస్, డెలివరీ పైపులైన్ పూర్తి చేసి మల్కపేట రిజర్వాయర్‌లో ఒక్క టీఎంసీ నీటిని నింపామని కిశోర్ వివరించారు. మల్కపేట నుంచి కెనాల్ ద్వారా మైసమ్మ చెరు వు వరకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
భూసేకరణ అడ్డంకి
మల్కపేట శివారులోని ఊర చెరువు శిఖం భూ ముల రైతులు తమ పొలాలు మునుగుతా యని భూసేకరణను అడ్డుకుంటున్నారని ఈఈ విశోర్ వివరించారు. ఎన్నిసార్లు అవగాహన కల్పించినా సహకరించడం లేదన్నారు. ఈ సమ స్య పరిష్కారమైతే.. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటి విడుదల సాధ్యమవుతుందని తెలిపారు.
రూ.138కోట్లతో అదనపు ఎత్తిపోతలు
కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లో 10వేల ఎకరాలకు సాగునీరు అందించే అదనపు ఎత్తిపోతల పథకానికి రూ.138కోట్లతో మెగా కంపెనీతో ఒప్పందం జరిగిందని ఈఈ కిశోర్ తెలిపారు. ఈ ఎత్తిపోతలకు 212 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 26.30 ఎకరాలు పూర్తయిందని తెలిపారు. భూసేకరణ పూర్తయితే అదనపు ఎత్తిపోతల పథకాలతో 10వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని కిశోర్ వివరించారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు అందిస్తామని స్పష్టం చేశారు.
పూడికతీత, పైపులైన్ పనులు ప్రారంభం
నీటిపారుదల విభాగం–8 ఈఈ కిశోర్

కాళేశ్వరం కాల్వ పనుల్లో కదలిక

కాళేశ్వరం కాల్వ పనుల్లో కదలిక