
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
● ఎస్పీ మహేశ్ బి.గీతే
ముస్తాబాద్(సిరిసిల్ల): అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ అధికారులు, సిబ్బంది ఉక్కుపాదం మోపాలని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. మంగళవారం ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పల్లెల్లో సమాచారం వ్యవస్థను బలోపేతం చేసుకోవాలన్నారు. తరచూ గ్రామాలను సందర్శించి, ప్రజల బాగోగులు అడిగి తెలుసుకోవాలన్నారు. 100 డయల్ కాల్స్‌పై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రౌడీ షీటర్లపై నిఘా పెట్టి, వారి చర్యలను గమనించాలని సూచించారు. ఇసుక, రేషన్ బియ్యం, గంజాయి వంటివాటిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ మొగిలి, ఎస్సై గణేశ్, సిబ్బంది ఉన్నారు.