
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్ల: అగ్నిప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరేందర్ కోరారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్, సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం, రేడియంట్, శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్, భారతి విద్యా నిలయం, శ్రీచైతన్య స్కూల్‌లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. అగ్ని ప్రమాదాలపై ఉపాధ్యాయులు అవగాహన పెంచుకుని విద్యార్థులకు వివరించాలని సూచించారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. అగ్నిమాపక సిబ్బంది, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.