
● స్కానింగ్ కేంద్రాలు తనిఖీ చేపట్టాలి ● వైద్య, ఆరోగ్యశ
లింగ నిర్ధారణపై కఠిన చర్యలు
సిరిసిల్లటౌన్: జిల్లాలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలన్నారను. భ్రూణ హత్యలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకో వాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధికంగా ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో నూతన ఆస్పత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ప్ర క్రియ కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరగాలని సూచించా రు. స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు కమిషనర్ అనుమతి తప్పనిసరి అని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అందుబాటులో ఉన్న డ్రగ్స్ వివరాలపై వైద్యసిబ్బందికి అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవల వివరాలు తెలుసుకున్నారు. రేడియాలజీ పరీక్షల నివేదికలు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ లు అందుబాటులో ఉంటూ అవసరమైన సేవలు సమర్థంగా అందించేలా చూడాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు.