
ఆలయ విస్తరణ పనులకు మోక్షం
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులకు శృంగేరి పీఠాధిపతులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర దేవా దాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్, అడ్వయిజర్ గోవిందాహరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి బృందం ఆది వారం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ స్వామితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆలయ విస్తరణ నమూనాలు, పూజా విధానాలు, భక్తుల దర్శనాలపై మాట్లాడారు. విస్తరణ పనులు సాగే క్రమంలో శ్రీరాజరాజేశ్వరస్వామికి నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు యథావిధిగా ఏకాంతంగా దేవాలయ అర్చక బృందం ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవల ఏర్పాట్లు భీమేశ్వర ఆలయంలో చేయాలని తెలిపినట్లు చెప్పారు. త్వరలోనే ఆలయ విస్తరణపై టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, సురేష్‌శర్మ, శృంగేరిపీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణశర్మ, ఏఈ రాంకిషన్‌రావు ఉన్నారు.
శృంగేరి పీఠాధిపతుల గ్రీన్‌సిగ్నల్
రాజన్న గుడిలో ఏకాంత సేవ
భీమన్నగుడిలో దర్శనాలు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్