Moinabad:మహిళను హత్య చేసి.. తగలబెట్టి! | - | Sakshi
Sakshi News home page

Moinabad:మహిళను హత్య చేసి.. తగలబెట్టి!

Published Tue, Jan 9 2024 5:48 AM | Last Updated on Tue, Jan 9 2024 7:21 AM

- - Sakshi

మొయినాబాద్‌: గుర్తు తెలియని ఓ మహిళను దుండుగులు హత్య చేసి రోడ్డు పక్కన తగలబెట్టారు. ఈ సంఘటన మొయినాబాద్‌ మండల పరిధిలోని బాకారం శివారులో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాకారం శివారులో డ్రీమ్‌వ్యాలికి వెళ్లే రోడ్డు పక్కన గుర్తుతెలియని మహిళ(25) మృతదేహం సోమవారం మధ్యాహ్నం మంటల్లో కాలుతుండడాన్ని బైక్‌పై వెళ్లేవాళ్లు గమనించి స్థానికులకు చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికీ మృతదేహం మంటల్లో కాలుతుండగా స్థానికుల సహాయంతో నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. దాదాపు మృతదేహం 80 శాతం కాలిపోయింది. దుండగులు మహిళను ఎక్కడో హత్యచేసి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఘటనాస్థలాన్ని సందర్శించిన అడిషనల్‌ డీసీపీ
మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాకారం శివారుల్లో జరిగిన మహిళ మృతదేహం కాల్చిన ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్‌ అడిషనల్‌ డీసీపీ రెష్మి పరిమల్‌, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి సందర్శించారు. ఘటనా స్థలంలో ఏవైనా ఆనవాళ్లు ఉన్నా యా అని పరిశీలించారు. మృతదేహం వద్ద సగం కాలిన సెల్‌ఫోన్‌ లభించింది. మృతదేహం తలకు కట్టి ఉన్న నల్ల వస్త్రాన్ని బట్టి ఆమె ముస్లిం అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

రంగంలోకి క్లూస్‌టీం
మహిళ మృతదేహం కాల్చిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్‌, ఎస్‌బీ బృందాలను రంగంలోకి దింపారు. క్లూస్‌టీం ద్వారా మృతదేహం నుంచి సగం కాలిన తల వెంట్రుకలు, వస్త్రాలు, ఇతర నమూనాలను సేకరించారు. రోడ్డు పక్కన ఉన్న ఫాంహౌస్‌ల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement