ఇబ్రహీంపట్నం రూరల్: బీఆర్‌ఎస్ పార్టీ తరఫున భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేశ్, పైలా శేఖర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం స్థానాన్ని ఆశించగా.. ‘సిట్టింగ్‌లకే సీట్లు’ ప్రకటనతో క్యామకు అవకాశం దక్కలేదు. కానీ శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషిచేస్తే ఎంపీగా పోటీకి అవకాశం కల్పిస్తామని గులాబీ పెద్దలు ఆయనకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గత ఆదివారం మాజీ మంత్రి సబితారెడ్డి వెంటవెళ్లి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. సోమవారం జనగామ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాస్ లీడర్‌గా మల్లేశ్‌కు మంచి పేరుంది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన బీసీ నేతగా గుర్తింపు సాధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. సుదీర్ఘ కాలం డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో క్యామకు టికెట్ వస్తుందనే ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment