నీటి ఎద్దడి లేకుండా చూడండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పైపులైన్లకు మరమ్మతులు చేయించి, లీకేజీలను నియంత్రించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. వేసవిలో నీటి సరఫరాలో ఎక్కడ సమస్యలు ఉత్పన్నమవుతాయో గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ, మండల, మున్సిపల్ అధికా రులు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా పని చేయాలన్నారు. జిల్లాలో గ్రౌండింగ్ అయిన పనులు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రజావాణికి 64 ఫిర్యాదులు
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్ప టికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు అంద జేసిన అర్జీలను అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 41, ఇతర శాఖలకు సంబంధించి 23 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అందించే వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.
వేసవిలో ఎక్కడా ఇబ్బంది రావొద్దు
అధికారులకు కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment