పులందరివాగు కబ్జా నిజమే
ఇబ్రహీంపట్నం రూరల్: పులందరి వాగు కబ్జా నిజమేనని అధికారులు స్పష్టంచేశారు. ‘పూడ్చేస్తాం.. ఆక్రమిస్తాం’ అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. సర్వే చేపట్టాలని ఆదేశించడంతో బుధవారం ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారుల బృందం సంయుక్తంగా సర్వే చేసింది. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఎంపీపటేల్‌గూడలో పట్టణానికి ఆనుకొని ఉన్న పులందరివాగును నగరానికిచెందిన ఓ బడా వ్యాపారి కాల్వను పూడ్చివేసి, బఫర్‌ను కబ్జా చేసి మట్టి పోసి చదును చేశాడు. ఇదే విషయమై పలుమార్లు మున్సిపాలిటీ అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిరోజులుగా భారీ ఎత్తున మట్టి పోయడాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, సర్వేయర్ సాయికృష్ణారెడ్డి, ఆదిబట్ల టౌన్ ప్లానింగ్ అధికారి అబీబ్ ఉన్నీసాబేగం, ఇరిగేషన్ ఏఈ హరితలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 500 మీటర్లకు పైగా ఉన్న కాలువను కబ్జా చేసినట్లు గుర్తించారు. కాల్వను కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. బఫర్‌తో పాటు కాలువలో పోసిన మట్టిని పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, రెండు రోజుల్లో హద్దులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘సాక్షి’ కథనంతో వాగుకు మోక్షం లభించిందని కితాబిచ్చారు.
వెల్లడించిన అధికారులు
పులందరివాగు కబ్జా నిజమే
Comments
Please login to add a commentAdd a comment