విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
షాద్‌నగర్‌రూరల్: విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ ఆరోపించారు. బుధవారం పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో విద్యార్థి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం విమర్శించారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సకాలంలో ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు అద్దెలు చెల్లించలేక, సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఆర్తిక్, ఉపాధ్యక్షులుగా సుమయిర్, శివశంకర్, కార్యదర్శిగా శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా ఓంకార్, శివసాయి, గిరిధర్, సభ్యులుగా యశ్వంత్, ఆదిల్, ఆఫ్సన్, సల్మాన్, నెహ్రూ, వినయ్, అశోక్, సమీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులను ప్రణయ్ అభినందించారు.
ఎడ్యుకేషన్ మంత్రిని నియమించాలి
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్
Comments
Please login to add a commentAdd a comment