కల్వకుర్తి అభివృద్ధే లక్ష్యం
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో రూ.250 కోట్లతో బీటీరోడ్ల నిర్మాణం చేపట్టామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. విపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా అభివృద్ధిపైనే తమ దృష్టి అని పేర్కొన్నారు. తలకొండపల్లి మండల పరిధి గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే పర్యటించారు. మండల కేంద్రంలో రూ.15 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, అంతారంలో రూ.15 లక్షలతో సీసీరోడ్లు, వెంకటాపూర్‌లో రూ.25 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, వెల్జాలలో రూ.20 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. విద్య, వైద్యం, రవాణా అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుందని, ప్రజాపాలన చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు సర్కార్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఆయా పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని వెల్లడించారు. పీసీసీ కిసాన్‌సెల్ రాష్ట్ర నాయకుడు మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లుఅంజయ్య, అజీం, వెంకట్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి, నర్సింహ ఉన్నారు.
రూ.250 కోట్లతో బీటీరోడ్లు
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment