అభివృద్ధిలో రాజకీయాలొద్దు
షాద్‌నగర్: ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీకి మంజూరు చేసిన రూ.28 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణాలు అభివృద్ధి చెందితేనే దేశం త్వరితగతిన ప్రగతి సాధిస్తుందని తెలిపారు. పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. అమృత్ పథకంలో భాగంగా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. పట్టణాల్లో 24 గంటలు తాగునీరు అందించేందుకు అమృత్ పథకాన్ని చేపట్టిందని అన్నారు. మంజూరైన నిధులతో ట్యాంకులు, పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో నియోజకవర్గ పరిధిలోని అందరు ఎమ్మెల్యేలతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బాబర్‌ఖాన్, రఘు నాయక్, చెంది తిరుపతిరెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, జమృత్‌ఖాన్, శ్రావణి, ఇబ్రహీం, ఎంకనోళ్ల వెంకటేశ్ పాల్గొన్నారు.
అంతా కలిసి పనిచేయాలి
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
Comments
Please login to add a commentAdd a comment