
శభాష్ పోలీస్
మహేశ్వరం: గురుకుల పాఠశాల అర్హత పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని దారితప్పడంతో పోలీసులు పరీక్ష కేంద్రానికి సకాలంలో తమ వాహనంలో చేర్చారు. గురుకులాల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఆదివారం రాష్ట్రవాప్తంగా అర్హత పరీక్ష నిర్వహించింది. ఓ విద్యార్థినికి కందుకూరు మండల పరిధిలోని కొత్తూరు సమీపంలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో సెంటర్ కేటాయించారు. ఆమె తల్లితో కలిసి పరీక్ష కేంద్రానికి వస్తూ అడ్రస్ తెలియక దారి తప్పి ఉదయం 10.40 గంటలకు మహేశ్వరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పరీక్ష కేంద్రం ఇక్కడ కాదు కందుకూరు మండలం కొత్తూరు సమీపంలో ఉందని చెప్పడంతో ఆందోళనకు గురైంది. గమనించిన మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు వెంటనే విద్యార్థితో పాటు ఆమె తల్లిని పోలీస్ పెట్రోల్ మొబైల్ వాహనంలోఎన్‌ఆర్‌ఐ కళాశాల పరీక్ష కేంద్రంలో 10.55 గంటలకు వదిలిపెట్టారు. విద్యార్థిని సమయానికి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి పరీక్ష రాయడంతో పోలీసులు చేసిన పనికి నెటిజన్లు శభాష్ అంటున్నారు. పరీక్ష రాసిన అనంతరం విద్యార్థిని, ఆమె తల్లి పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
పరీక్ష కేంద్రానికి దారి తప్పిన విద్యార్థిని
సమయానికి తమ వాహనంలో చేర్చిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment