
ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్ లారీల పట్టివేత
అనంతగిరి: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మోమిన్‌పేట, నవాబ్‌పేట పీఎస్ పరిధిలో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, మూడు టిప్పర్ లారీలను, రెండు జేసీబీలను సీజ్ చేసి, ఆయా పీఎస్‌లలో కేసు నమోదు చేశారని జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ప్రశాంత్ వర్దన్ తెలిపారు. మోమిన్‌పేట పీఎస్ పరిధిలోని దేవరాంపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీ సీజ్ చేసి మోమిన్‌పేట పీఎస్‌లో కేసు నమోదు చేశారు. నవాబ్‌పేట మండల పరిధిలోని అర్కతల గ్రామ శివారులో ఎర్రమట్టి తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు దాడులు చేసి మూడు టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేసి పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
పరిగిలో..
పరిగి: అక్రమంగా అటవీ ప్రాంతంలో మట్టి తవ్వుతున్న జేసీబీని అటవీశాఖ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నజీరాబాద్ తండాలోని అటవీప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారనే సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి జేసీబీని పట్టుకుని సీజ్ చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఉన్నత అధికారుల సూచనల మేరకు కేసు నమోదు చేశామని, సంబంధిత నివేదిక పత్రాలను అధికారులకు అందించామని పరిగి ఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమా తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment