
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
షాద్‌నగర్ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 2025– 26 విద్యా సంవత్సరం ఐదో తరగతి ప్రవేశాలకు వీటీజీ సెట్, 6,7,8,9 తరగతులకు బీఎల్‌వీ సెట్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు.. విద్యార్థులను తనిఖీచేసి పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. కమ్మదనం గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 559 మంది విద్యార్థులకు గాను 547 మంది హాజరు కాగా, 12 మంది గైర్హాజరయ్యారు. ఈ సెంటర్‌ను చీఫ్ సూపరింటెండెంట్ విద్యుల్లత, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ శివరంజని పరిశీలించారు.
డిగ్రీ కళాశాలలో..
పట్టణ సమీపంలోని నూర్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా తెలిపారు. 396 మంది విద్యార్థులకు గాను 387 మంది హాజరు కాగా, 9 మంది గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీతా, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ పద్మావతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
చిలుకూరు గురుకుల పాఠశాలలో..
మొయినాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 గంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడి నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 90 శాతం విద్యార్థులు హాజరయ్యారు. చిలుకూరు గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 5వ తరగతికి సంబంధించి 452 మంది విద్యార్థులకు గాను 410 మంది హాజరయ్యారు. 6వ తరగతి పరీక్షకు 154 మందికి 134 మంది, 7వ తరగతి పరీక్షకు 95 మందికి 88 మంది, 8వ తరగతి పరీక్షకు 29 మందికి 27 మంది, 9వ తరగతి పరీక్షకు 37 మందికి 37 మంది హాజరయ్యారు. మొయినాబాద్ శంకర్‌పల్లి గురుకులంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 217 మందికి 206 మంది పరీక్ష రాశారు.
552 మంది హాజరు
కందుకూరు: తెలంగాణ గురుకుల పాఠశాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2025– 26 విద్యా సంవత్సరం కోసం సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి రెగ్యులర్‌తో పాటు 6,7,8,9 తరగతుల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం పరీక్ష నిర్వహించారు. మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో నిర్వహించిన పరీక్షలో 565 మంది విద్యార్థులకు గాను.. 552 మంది హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment