
అత్తాపూర్‌లో విజిబుల్ పోలీసింగ్
అత్తాపూర్: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముష్క్ మహల్, నెక్‌లెస్ రోడ్, బారా ఇమార్ దర్గా , సెట్విన్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. ముష్క్ మహల్ ప్రాంతంలో మురాఠి ప్రభాకర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి మద్యం సేవిస్తుండటంతో కేసులు నమోదు చేశారు. పేకాట ఆడుతున్నకిషన్‌బాగ్‌కు చెందిన సయ్యద్ ఫక్రుద్దీన్, మొహమ్మద్ ఇమ్రాన్, అజీయుద్దీన్, మీర్ ఆజామ్ ఆలీ, సయ్యద్ మెరాజ్, మొహమ్మద్ వాజీద్, మొహమ్మద్ అజీమ్‌ల పై కేసులు నమోదు చేసి వారి నుంచినుంచి రూ.60,520 నగదు, రెండు సోలార్ లైట్లు, ఆరు సెట్ల గేమింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అత్తాపూర్‌లో విజిబుల్ పోలీసింగ్
Comments
Please login to add a commentAdd a comment