
రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి
షాబాద్: రెండు బైకులు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ కాంతారెడ్డితెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండల పరిధి మల్లాపూర్‌తండాకు చెందిన మెగావత్‌నైందు(27) మద్దూరు బాలాజీ ఫంక్షన్‌హాల్లో జరిగిన వివాహ వేడుకకు వెళ్లాడు. షాబాద్‌మండలం లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన కావలి రంజిత్‌కుమార్.. మూడు సంవత్సరాల కుమారుడు కాంత్రికుమార్‌తో కలిసి శంషాబాద్‌మండలం వెంకటాపూర్‌లో జరిగిన పెళ్లికి వెళ్లారు. వీరువురు తిరుగు ప్రయాణంలో బాలాజీ ఫంక్షన్‌హాల్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మెగావత్ మృతి చెందగా.. రంజిత్ అతని కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తంఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రంజిత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నైందు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరొకరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment