‘సాండ్ బజార్’లో తక్కువ ధరకే లభ్యం
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్: దళారీ వ్యవస్థను అరికట్టి, సామాన్యుడికి తక్కువ ధరకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కార్పొరేషన్ చైర్మన్ అనిల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో ఇసుక విక్రయకేంద్రాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో టీఎస్‌ఎండీసీ ఎండీ.సుశీల్‌కుమార్, జనరల్ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ నర్సిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీవాణి పాల్గొన్నారు.