
● రోజు విడిచి రోజు..
బడంగ్‌పేట్: నాదర్‌గుల్, బడంగ్‌పేట్, గుర్రంగూడ, కుర్మల్‌గూడ, అల్మాస్‌గూడ, మల్లాపూర్, వెంకటాపూర్, బాలాపూర్, మామిడిపల్లి ప్రాంతాలను కలుపుతూ మిషన్ భగీరథ పథకం కింద పది లక్షల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న 13 ట్యాంకులు నిర్మించారు. మీర్‌పేట, జిల్లెలగూడ, వినాయకహిల్స్, తిరుమలనగర్ ప్రాంతాలను కలుపుతూ మరోలైన్ ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్‌లైన్లు ఏర్పాటు చేసి రోజువిడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 5వ డివిజన్, ఇతర కాలనీల్లో వారానికి ఒకసారి కృష్ణా నీరు వచ్చేది. ఇటీవలే సమస్యను పరిష్కరించి రోజువిడిచి రోజు సరఫరా చేస్తున్నారు. సాయినగర్ కాలనీలో నీటి సరఫరా సరిగ్గా కావడం లేదని కొంత కాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. క్షేత్ర పరిశీలన చేసి కొత్తలైన్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని జలమండలి అధికారులు చెబుతున్నారు.