హుడాకాంప్లెక్స్: బడ్జెట్‌లో ఈసారి విద్యకు ఆశించిన నిధులు కేటాయించలేదు. కేవలం రూ.23,108 కోట్లు(7.57శాతం) మాత్రమే పద్దులో చూపారు. గతేడాది కంటే 0.2శాతం కేటాయించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ఇప్పటికీ అనేక గురుకులాలు అద్దె భవనాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు ప్రత్యేక వసతులు లేక వారిలో డ్రాప్‌అవుట్ శాతం పెరుగుతోంది. 7.57 శాతం బడ్జెట్‌తో ఇవన్నీ సాధ్యమేనా.
– కరుణాకర్‌రెడ్డి, ఎస్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు