Telangana: BRS Leader, Son Die in Road Accident in Narsingi - Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ నేత, తనయుడి మృతి

Published Sun, Jul 23 2023 6:34 AM | Last Updated on Sun, Jul 23 2023 6:39 PM

- - Sakshi

రామాయంపేట: దైవదర్శనానికి వెళుతుండగా బీఆర్‌ఎస్‌ నేత, అతని కుమారుడు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపునకు దూసుకెళ్లగా..ఎదురుగా వచ్చిన కంటైనర్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మెదక్‌జిల్లా నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. నా ర్సింగి మండల బీఆర్‌ఎస్‌ నేత, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు తౌర్యానాయక్‌(42), ఆయన కుమారుడు అంకిత్‌ (10) కారులో కర్నాల్‌పల్లి ఎల్లమ్మగుడికి దర్శనం నిమిత్తం వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీ.. వీరి వాహనాన్ని ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లింది.

కారులోనే ఇరుక్కుపోయిన తండ్రీ, కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు రెండు గంటలపాటు శ్రమించి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement