మెదక్: మండలంలోని దామరచెరువు గ్రామ కార్యదర్శి కొత్త సంధ్యారాణి(38) మంగళవారం మృతి చెందారు. వారం రోజుల క్రితం అస్వస్తతకు గురైన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందినట్లు సర్పంచ్ శివప్రసాదరావు తెలిపారు. మూడేళ్లుగా గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సంధ్యారాణి మృతికి పలువురు సంతాపంగా గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment