
హత్య చేసి.. దహనం చేశా..!
నిందితుడిని సంగారెడ్డి పోలీసులకు అప్పగింత
దొరకని మృతదేహం
ఆనవాళ్లు
పోలీసుల ఎదుట
లొంగిపోయిన నిందితుడు
రోడ్డుపై బైఠాయింపు
విషయం తెలుసుకున్న దశరథ్ కుటుంబీకులు, బంధువులు నిజాంపేట్– ఖేడ్ 161బీ జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతదేహన్ని అప్పగించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కాగా, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే.. గోపాల్ చెప్పినట్లు మృతదేహం ఆనవాళ్లు లభించకపోవడం.. అసలు దశరథ్ హత్యకు గురయ్యాడా లేదా అనేది పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
నారాయణఖేడ్: ‘‘నేను దశరథ్‌ను హత్య చేసి.. దహనం చేశా.. అందుకే మీ ముందు లొంగిపోతున్న’అని ఓ వ్యక్తి పోలీసులకు చెప్పడం కలకలం సృష్టించింది. నిందితుడు నిర్భయంగా, నేరుగా వచ్చి తానే హత్య చేశానంటూ ఒప్పుకోవడంతో పోలీసులు కంగుతిన్నారు. ఈ సంఘటన నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట్ మండలం నాగ్‌ధర్ రాంచందర్ తండాకు చెందిన దశరథ్ (30) సంగారెడ్డిలోని గణేష్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వెళుతున్నానని చెప్పి తన యజమాని బైక్ తీసుకొని బయలుదేరి అదృశ్య మయ్యాడు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. దశరథ్‌ను తానే హత్య చేసి కాల్చి వేశానంటూ నారాయణఖేడ్ మండలం మేఘ్యానాయక్ తండాకు చెందిన గోపాల్.. ఖేడ్ పోలీస్టేషన్‌లో లొంగిపోయాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు తండాల శివారులు, అటవీ ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. నిందితుడు గోపాల్‌ను సంగారెడ్డి రూరల్ పోలీసులకు అప్పగించినట్లు ఖేడ్ ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.

హత్య చేసి.. దహనం చేశా..!
Comments
Please login to add a commentAdd a comment