విందుకు వెళ్లి వస్తుండగా..
● బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి
● కోహీర్ మండలం సేడెగుట్ట తండా వద్ద ఘటన
జహీరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన కోహీర్ మండలం సిద్దాపూర్ తండా సమీపంలో తాండూరు రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కోహీర్ పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ మండలం అర్జున్‌నాయక్ తండాకు చెందిన రాథోడ్ శంకర్(25), జాటోతు పవన్(26) రాత్రి సేడెగుట్ట తండాలో జరిగిన జాతర విందులో పాల్గొన్నారు. అనంతరం సమీపంలోని సిద్ధాపూర్ తండాకు చెందిన బంధువుల ఇంటికి వెళుతున్న క్రమంలో తాండూరు నుంచి జహీరాబాద్ వెళుతున్న నైట్‌హాల్ట్ ఆర్టీసీ బస్సు గొటిగార్‌పల్లి ఫారెస్టు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాథోడ్ శంకర్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన పవన్‌ను వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. మృతులు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు యువకుల మరణంతో అర్జున్‌నాయక్ తండాలో విషాదం అలుముకుంది. కోహీర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
విందుకు వెళ్లి వస్తుండగా..
Comments
Please login to add a commentAdd a comment