బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
● అలియా బేగం కుటుంబసభ్యులను పరామర్శించిన ఎస్పీ
● విద్వేషాలను రెచ్చగొట్టొద్దు
మునిపల్లి(అందోల్)/సంగారెడ్డి జోన్: మునిపల్లి మండలం అంతారం గ్రామంలో ఓ ఖాళీ స్థలంలో మూత్రం పోసిందని సదరు స్థల యజమానులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన టెన్త్ విద్యార్థి అలియా బేగం కుటుంబసభ్యులను జిల్లా ఎస్పీ రూపేశ్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపించామని తెలిపారు. అలియా బేగంపై వారికి ఎలాంటి కక్షలేదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే భావించాలన్నారు. విద్యార్థి మృతిపై సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టొద్దని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజీయే రాజమార్గం
రాజీ పడటమే రాజమార్గమని, మార్చి 8న జరగనున్న జాతీయ లోక్–అదాలత్‌ను ఇరువర్గాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రూపేశ్ పేర్కొన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment