రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ట్రైనీ కలెక్టర్ మనోజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్స్ కమిటీ (డీసీసీ) డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో డిసెంబర్ 2024 – 25 ఆర్థిక ఏడాదికి సంబంధించి వివిధ బ్యాంకుల ద్వారా అందజేసిన వ్యవసాయ, వ్యవసాయేతర రుణాల వివరాలు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన యూనిట్లు, గ్రౌండింగ్ అయిన యూనిట్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు అందజేసిన రుణాలు, లక్ష్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మనోజ్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల కుటుంబాల్లో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ మంజూరు చేసిన స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందజేసి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం దేబోజిత్ బారువా, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ సూర్య ప్రకాశ్, యూబీఐ రీజినల్ మేనేజర్ వికాస్ కుమార్, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ, నాబార్డ్ ఎల్డీఎం గోపాల్‌రెడ్డి, సీఈవో జానకిరెడ్డి, పీడీఆర్‌డీవో జ్యోతి, పీడీ మెప్మా గీత సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ట్రైనీ కలెక్టర్ మనోజ్
Comments
Please login to add a commentAdd a comment