సంగమేశ్వర, బసవేశ్వరకు అధిక నిధులు కేటాయించాలి
నారాయణఖేడ్: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. కుడి, ఎడమ కాల్వలను ఏర్పాటుచేసి అధిక శాతం రైతుల భూములకు సాగునీరు అందించాలని కోరారు. సోమవారం నియోజకవర్గంలోని మంజీరా తీరం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణఖేడ్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి సాగునీటిని అందిస్తే పంటలు బాగా పండి వ్యవసాయ అభివృద్ధికి అవకాశం ఉందని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాణిక్, నాయకులు సాయిలు, రమేష్, అశోక్, నర్సింహులు, ప్రవీణ్, అరుణ్, దత్తు, బాబురావు, ఎల్లయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఓబీసీ విభాగ
సమావేశంలో ఎమ్మెల్యే
నారాయణఖేడ్: హైదరాబాద్ గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షులు కెప్టెన్ అజయ్‌సింగ్ యాదవ్‌ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.
అసైన్డ్ భూముల పరిశీలన
జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామ పరిధిలో గల అసైన్డ్ భూములను ట్రైనీ కలెక్టర్ మనోజ్ సోమవారం పరిశీలించారు. గతంలో పర్వతాపూర్ పరిధిలో గల ప్రభుత్వ భూములను నిరుపేదల జీవనోపాధి కోసం ఇచ్చారు. విలువైన అసైన్డ్ భూముల గురించి ఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ హసీనా బేగం ద్వారా తెలుసుకుని, రైతులతో ఆయన మాట్లాడారు. గ్రామ పరిధిలో ప్రభుత్వ, పట్టా భూముల విస్తీర్ణం గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. అటవీ భూముల స్థితిగతుల గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ హసీనా బేగం, ఆర్‌ఐ సాయికిరణ్‌లు ఉన్నారు.
హరీశ్ ప్రకటనతో
కదిలిన అధికారులు
మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
జోగిపేట(అందోల్): బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పాదయాత్ర ప్రకటనతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఈ మేరకు సంగమేశ్వర, బసవేశ్వర పథకాలు పనులు ప్రారంభిస్తామని ఇరిగేషన్ అధికారులు హరీశ్‌రావుకు ఫోన్‌లు చేసి చెబుతున్నారని చెప్పారు. జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చింది కేసీఆరేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాలయ్య, రామాగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ పి.నారాయణ, అందోలు, పుల్కల్ మండల పార్టీల అధ్యక్షులు లక్ష్మికాంతరెడ్డి, విజయ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు సార శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సంగమేశ్వర, బసవేశ్వరకు అధిక నిధులు కేటాయించాలి
సంగమేశ్వర, బసవేశ్వరకు అధిక నిధులు కేటాయించాలి
సంగమేశ్వర, బసవేశ్వరకు అధిక నిధులు కేటాయించాలి
Comments
Please login to add a commentAdd a comment