పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మహిళా డిగ్రీ కళాశాల ‘విపణి’ కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి
వంద శాతం పన్ను వసూలు చేయాలి
అధికారుల సమీక్షలో కలెక్టర్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకాంక్షించారు. విద్యార్థి దశ నుంచి మార్కెటింగ్ అవకాశాలపై శిక్షణ ఇవ్వడం ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన శిక్షణలను అందించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారన్నారు. మహిళా డిగ్రీ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపణిని కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన వంటకాలను కలెక్టర్ రుచి చూశారు. హ్యాండీక్రాప్ట్ స్టాళ్లను పరిశీలించారు.
సంగారెడ్డి జోన్: జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో 100శాతం పన్నులు వసూలు లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పన్ను వసూళ్లకు ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లకు సహకరించాలన్నారు. పన్ను చెల్లిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని, జిల్లాలోని పరిశ్రమలలో కూడా పనులు వసూలు చేయాలని సూచించారు. జిల్లాలో పన్నుల బకాయిలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వేసవికాలంలో మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలలో అదనపు అంతస్తుల కళాశాల భవనాల, పరిశ్రమల నిర్మాణం కోసం దరఖాస్తులను పరిశీలించి వెంటనే పన్నులు వసూలు చేసి అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పార్కుల్లో పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మిషన్ భగీరథ కనెక్షన్లు తాగునీటి పైపులు లైన్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్‌డీవో రవీందర్‌రెడ్డి, ప్రజా వైద్యారోగ్య అధికారి ప్రతాప్, జిల్లా ఉన్నతాధికారులు, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment