వోక్స్‌వ్యాగన్ వర్సిటీ ప్రొఫెసర్ ఆత్మహత్య
మునిపల్లి(అందోల్): కంకోల్ వోక్స్ వ్యాగన్ యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనర్ విభాగంలో అధ్యాపకుడు ప్రొఫెసర్ సుమంత్ కుమార్(36) వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుమంత్ కుమార్ 18 నెలలుగా మునిపల్లిలోనే ఉంటూ వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనతో పాటు మరో వ్యక్తి కలసి ఒకే గదిలో ఉంటున్నారు. ప్రతీరోజు ఉదయం 9 గంటలకు వర్సిటీలో తరగతులకు హాజరుకావాల్సిన సుమంత్ మధ్యాహ్నం 12 గంటలైనా డిపార్ట్‌మెంట్‌కు రాకపోవడంతో సిబ్బంది ఆయన రూమ్ వద్దకు వెళ్లి తలుపులు తెరిచి చూడగా అప్పటికే ఆయన ఫ్యాన్‌కు వేలాడుతూ నిర్జీవంగా కన్పించారు. దీంతో వర్సిటీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని కిందికి దించి పంచనామా నిమిత్తం సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జార్ఖండ్‌లో ఉంటున్న సుమంత్ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. కాగా, సుమంత్‌తో పాటు ఉండే మరో వ్యక్తి ఆదివారం ఊరికి వెళ్లగా అప్పట్నుంచి ఆయన ఒక్కరే గదిలో ఉంటున్నారు. కాగా, బుధవారం ఉదయం వర్సిటీలో సమీపంలోని ఓ దేవాలయానికి వెళ్లి వచ్చినట్లు వర్సిటీ సిబ్బంది చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
18 నెలలుగా ఇక్కడ విధులు
మృతుడు జార్ఖండ్ వాసి
Comments
Please login to add a commentAdd a comment