గురక తగ్గడం కోసం సర్జరీ
● మరుసటి రోజే వ్యక్తి మృతి ● వైద్యం వికటించి చనిపోయాడంటూకుటుంబీకుల ఆందోళన ● సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన
సంగారెడ్డి: వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామానికి చెందిన వెల్డురి శ్రీనివాస్(47) నిద్రలో గురక బాగా వస్తోందని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాడు. వైద్యులు పరీక్షించి ముక్కులో బోన్ పెరిగిందని ఆపరేషన్ చేస్తే గురక తగ్గుతుందని చెప్పారు. దీనికి శ్రీనివాస్ ఒప్పుకోవడంతో బుధవారం సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం రాత్రి శ్రీనివాస్ గుండెపోటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా చనిపోతాడని డాక్టర్లను నిలదీశారు. గురువారం ఉదయం మృతుడి బంధువులు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుజేశారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రమేశ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment