సూచిక కమాన్‌ను ఢీకొట్టిన డీసీఎం
తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డుపై ఏర్పాటు చేసిన సూచిక కమాన్‌ను డీసీఎం ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం మండలంలోని రామాయపల్లి శివారులో అదుపుతప్పి సూచిక కమాన్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఒంగోలుకు చెందిన ప్రశాంత్ గణేశ్, మిత్రురాలు ప్రత్యూషతో కలిసి స్నేహితుడి వివాహం కోసం కామారెడ్డి వెళ్తున్నారు. అడ్రస్ కోసం రోడ్డు పక్కన కారు నిలిపి మ్యాప్ చూస్తున్నారు. డీసీఎం ఢీకొట్టగా కమాన్ ఒరిగి వీరి కారుపై పడిపోయింది. ప్రత్యూషకు, డీసీఎం డ్రైవర్ మహ్మద్ అలీంకు గాయాలయ్యాయి. కారు యజమాని గణేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తూప్రాన్ ఎస్‌ఐ శివానందం తెలిపారు.
కారుపై పడిపోవడంతో ఇద్దరికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment