సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. గురువారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ప్రభుత్వాస్పత్రిలోని అత్యవసర ద్వారం వద్ద గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడ్డి ఉంది. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రి ఆవరణలో గల పలు దుకాణాల్లో భిక్షాటన చేసే మహిళగా పోలీసులు గుర్తించారు. మృతురాలి వయసు 50 నుంచి 52 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు. సెక్యూరిటీ గార్డు కల్పగూరి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు తెలిస్తే 87126 56718 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. అలాగే మరో గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని, ఆమె వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. సెక్యూరిటీ ఇన్‌చార్జి జాన్.డీ శాన్‌టిస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి వద్ద గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment