జ్యోతిషం పేరుతో మోసం
రూ.లక్ష కాజేసిన దొంగ బాబా
మద్దూరు(హుస్నాబాద్): జ్యోతిషం పేరుతో మోసం చేసి రూ.లక్ష కాజేసిన దొంగ బాబాను మద్దూరు పోలీస్‌లు అరెస్టు చేశారు. చేర్యాల సీఐ శ్రీను కథనం మేరకు.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దక్షిణపు శివయ్య అనే బాబా ఇటీవల చేర్యాల మండలం కమాలయపల్లి గ్రామానికి చెందిన ధర్మోజీ నారాయణచారి జీ టీవీలో జ్యోతిషం చెప్పబడును అని ఒక ఫోన్ నంబర్‌ను చూశాడు. ఆ నంబర్ ద్వారా బాబాకు ఫోన్ చేసి తన ఇంటిలో ఇబ్బందులు ఉన్నాయని, మనశ్శాంతి దొరకడం లేదని చెప్పాడు. పూజ చేస్తే మంచి జరుగుతుందని బాధితుడిని బాబా నమ్మించాడు. రెండు విడుతల్లో రూ.లక్ష తీసుకున్నాడు. మళ్లీ కొద్ది రోజులకు మరిన్ని డబ్బులు కావాలని అడుగడంతో నారాయణచారికి అనుమానం వచ్చి పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. పోలీస్‌లు సాంకేతి పరిజ్ఞానం ఉపయోగించి దొంగ బాబాను పట్టుకున్నారు. అతడి ఫోన్ సీజ్ చేసి లక్ష రూపాయలను బాధితుడికి అందించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట మద్దూరు ఎస్‌ఐ షేక్ మహబుబ్, పోలీసులు, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment