
ఎమ్మెల్యేకు ఆహ్వానం
సంగారెడ్డి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ 134వ జయంత్యుత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 14 నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను అంబేడ్కర్ ఉత్సవ కమిటీ కోరింది. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 14న ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
బీఆర్‌ఎస్ సభ
పోస్టర్ ఆవిష్కరణ
సంగారెడ్డి : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన పట్టణ, మండల నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇందుకు సంబంధించిన సభ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్‌లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలనలో కాంగ్రెస్ విఫలం
ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ టౌన్: వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజోత్సవ సభకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు పిలుపు నిచ్చారు. క్యాంప్ కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్‌తో కలిసి గురువారం రజోత్సవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలోలేరని చెప్పారు. రజోత్సవ సభలో కేసీఆర్ ప్రజల భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తట్టునారాయణ, గుండప్ప, నామ రవికిరణ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
హరీశ్‌పై అట్రాసిటీ కేసునమోదు చేయాలి
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హరీశ్‌రావుపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ... బుధవారం గణేశ్‌గడ్డ దేవస్థానం వద్ద జరిగిన సమావేశంలో హరీష్‌రావు హెచ్‌సీయూ విద్యార్థులపై నమోదైన కేసుల గురించి మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసులు పెట్టిస్తే ఉపముఖ్యమంత్రి కేసు ఉపసంహరించుకుం టాడంట అంటూ..తోక కుక్కను ఆడిస్తుందో లేక కుక్క తోకను ఆడిస్తుందో అర్థం కావడం లేద’ని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. భట్టి విక్రమార్కను కుక్కతో పోల్చి దళితుల మనోభావాలను దెబ్బతీసిన హరీశ్‌రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఎమ్మెల్యేకు ఆహ్వానం