శ్రీపాదరావుకు నివాళి
నారాయణఖేడ్: ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు జయంతిని ఆదివారం హైదరాబాద్‌లోని శాసనసభ లాంజ్‌లో నిర్వహించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నేడు కిసాన్ సంఘ్
ఆవిర్భావ వేడుకలు
సంగారెడ్డి టౌన్: భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలను సంగారెడ్డి జిల్లా కార్యా లయంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. అనంతరం రైతులతో సమావేశం ఉంటుందని, కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
దైవభక్తిని అలవర్చుకోవాలి
పటాన్‌చెరు టౌన్: ప్రతీ ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవాలని న్యాయవాది నాగరాజు యాదవ్ అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి పోచారంలోని హనుమాన్ దేవస్థానం వద్ద భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల్లో భక్తిభావంతో పాటు దేశభక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో వివేకానంద సేవ సమితి అధ్యక్షుడు శేషాద్రి, బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment