
కార్మిక వ్యతిరేక కోడ్‌లను రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర నేత మల్లికార్జున్
గజ్వేల్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తయారు చేసిన కోడ్‌లను వెంటనే రద్దుచేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలపై 30 శాతం పన్నుల భారం వేసి నడ్డి విరుస్తుండగా, కార్పొరేట్ సంపన్నులపై 32 శాతంగా ఉండగా, కేంద్ర ప్రభుత్వం దానిని 22 శాతానికి కుదించిందని విమర్శించారు. ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసిందని, కార్మిక రంగానికి రూ.3,500 కోట్లు, ఉపాధి హామీ కార్మికులకు రూ.80 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని వాపోయారు. కార్పొరేట్ సంస్థలకు వేలకోట్ల రాయితీలు ఇచ్చారని మండిపడ్డారు. కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ ఉద్యమంలో కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆర్‌బీఎల్ యూనియన్–సీఐటీయూ ఉప ప్రధాన కార్యదర్శి బండ్ల స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, నాయకులు వేణుగోపాల్, చంద్రశేఖర్‌రెడ్డి, రంగారెడ్డి, స్వామి, శ్రీనివాస్, వెంకట్రావ్, రవికుమార్, నర్సింహులు, సాజిద్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment