
ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరా
మంత్రి దామోదర రాజనర్సింహ
మునిపల్లి(అందోల్): ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరాను తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బుదేరా శివారులో గల హనుమాన్ దేవాలయం వద్ద వైదిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బర్ధిపూర్ దత్తాత్రేయ పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం బుదేరా శివారులో వైదిక పాఠశాలను ఏర్పాటు చేసి కులమతాలకతీతంగా పిల్లలకు వేదాలు నేర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిద్ధేశ్వర్ మహరాజ్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మనోహర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్‌కుమార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సహించం
గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి
గజ్వేల్: రాజకీయ భిక్ష పెట్టిన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు నాయిని యాదగిరి అనుచితవ్యాఖ్యలు చేయడం సహించేదిలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్‌లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, టీపీసీసీ నేత సాజిద్ బేగ్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, తమ్మిలి శ్రీనివాస్, రవీందర్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల కోసం పాకులాడుతూ నర్సారెడ్డిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తన సొంత ఆస్తులను అమ్ముకుంటున్న చరిత్ర నర్సారెడ్డిదని చెప్పారు. నాయిని యాదగిరితోపాటు మల్లారెడ్డి, గోపాల్‌రావు, అనిల్‌రెడ్డి, మనోహరాబాద్ మల్లారెడ్డిలు పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న వీరి వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
క్రీడల్లో రాణిస్తే
బంగారు భవిష్యత్
రాష్ట్రస్థాయి ఆర్చరీ విజేత లక్ష్మీఅభయా రెడ్డి
రామచంద్రాపురం(పటాన్‌చెరు):క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజు అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన రాష్ట్ర ఆర్చరీ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ పోటీలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. రాజు మాట్లాడుతూ ఆర్చరీ చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడలలో రాణించే వారికి విద్య, ఉపాధి, ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్‌లు ఉంటాయని చెప్పారు. అందులో ఎంపికై న వారు ఈనెల 22న విజయవాడలో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ క్రీడల్లో పాల్గొంటారని చెప్పారు. అండర్–10 బాలికల విభాగంలో మొదటి బహుమతి సాధించిన ఉప్పల్ మెరీడియన్ పాఠశాల విద్యార్థిని లక్ష్మీఅభయారెడ్డిని ఆయన అభినందించారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరా
Comments
Please login to add a commentAdd a comment