
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
● ఐఐటీ హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి ధన్‌ఖఢ్ పర్యటన ● స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్పీ, ఎంపీ ● ఐఐటీ ఆవరణలో నాటిన మొక్కలు
సంగారెడ్డి జోన్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్ కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో పర్యటించారు. ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో కలిసి క్యాంపస్‌ను సందర్శిచారు. మధ్యాహ్నం సుమారు 3:15 నిమిషాలకు మూడు ప్రత్యేక హెలిక్యాప్టర్ల ద్వారా క్యాంపస్‌కు చేరుకున్నారు. క్యాంపస్‌కు వచ్చిన వారికి గవర్నర్, ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బీఆర్ మొహన్‌రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్, ఎంపీ రఘునందన్‌రావు, ఐఐటీ హెచ్ డైరెక్టరు బీఎస్ మూర్తి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి పుష్ఫగుచ్ఛాలు అందించి, మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. క్యాంపస్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి ప్రోత్సహించే సంకేతంగా ఉప రాష్ట్రపతి భార్య డా.సుదేశ్ ధన్‌ఖఢ్‌తో కలిసి ఏక్ పేడ్ మా కె నామ్ పేరుతో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం క్యాంపస్ సభాస్థలి వెళ్లారు. జాతీయ గీతాలాపన చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటీ డైరెక్టరు బీఎస్.మూర్తి ఉప రాష్ట్రపతితో పాటు గవర్నర్‌కు శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను బహూకరించారు. ఐఐటీ డైరెక్టరు ఐఐటీ సాధించిన ముఖ్యమైన విజయాలను వివరించారు. ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించి, విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ప్రత్యేక హెలిక్యాప్టర్లలో సుమారు 4:30 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. సుమారు గంటన్నర పాటు క్యాంపస్ సందర్శించి, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో క్యాంపస్ ఆవరణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు
నాకు అతిథులు
ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు తనకు అతిథులని, పార్లమెంట్‌ను సందర్శించాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత దేశం వివిధ భాషల నిలయమని చెప్పారు. పార్లమెంట్‌లో అన్ని భాషలు ట్రాన్స్‌లేట్ అవుతున్నాయని చెప్పారు. కాగా, పర్యటన విజయవంతం చేసిన అధికారులకు, పోలీస్ సిబ్బందికి, అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ అభినందించారు.
రిజర్వేషన్ల ప్రాతిపదికనే
నామినేటెడ్ పదవులు
వర్గల్(గజ్వేల్): వివిధ నామినేటెడ్ పదవులను రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం గౌరారం ఎస్సీవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇక్కడి సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, సీఎం రేవంత్‌రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యకర్తలు ప్రతిఒక్కరూ పార్టీకి విధేయులై పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని, ప్రజాయుత సమస్యలను పార్టీ శ్రేణులు తన దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
Comments
Please login to add a commentAdd a comment