హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్‌చార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంట చేతికి వస్తున్నా కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయలేదన్నారు. సన్ ఫ్లవర్ క్వింటాలుకు రూ.6వేలు మద్దతు ధర నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో దళారులు క్వింటాలుకు రూ.5వేలకే కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం చొరవ తీసుకొని వెంటనే కొనుగొలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment