ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోటీలో 16 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ డోనరుమ్మ గుకేష్ 9వ రౌండ్‌లో కార్ల్‌సన్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచాడు. కాగా గుఖేష్ తెల్ల పావులతో బరిలోకి దిగి సంచలన విజయం నమోదు చేశాడు.
శనివారం 19 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగిసే కార్ల్‌సన్‌ను ఓడించిన ఒక్కరోజు వ్యవధిలోనే గుకేష్ కూడా ప్రపంచచాంపియన్‌ను చిత్తు చేయడం విశేషం. కాగా కార్ల్‌సన్‌ను ఓడించిన యంగ్ గ్రాండ్‌మాస్టర్‌గా గుఖేష్ నిలిచాడు. ఈ చెస్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 16 మంది ఆటగాళ్లు ఉండగా.. అందులో ఐదుగురు భారత్ నుంచే ఉన్నారు.
కాగా, ఇటీవలి కాలంలో వరల్డ్ ఛాంపియన్ కార్ల్‌సన్.. భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో తరుచూ ఓడిపోతున్నాడు. నెల రోజుల వ్యవధిలో కార్ల్‌సన్ భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో ఓడిపోవడం ఇది ఐదోసారి. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మూడు సార్లు కార్ల్‌సన్‌పై విజయం సాధించగా, అర్జున్ ఇరగైసి కార్ల్‌సన్‌ను ఓడించగా.. తాజాగా వీరి సరసన గుఖేష్ చోటు సంపాదించాడు.
Comments
Please login to add a commentAdd a comment