ప్రజ్ఞానంద ‘హ్యాట్రిక్‌’ విజయం.. దిగ్గజ ఆటగాడితో సంయుక్తంగా | Praggnanandhaa Hat-trick Win Leads 1st Palce Chess Champion Carlsen | Sakshi
Sakshi News home page

Praggnanandhaa: ప్రజ్ఞానంద ‘హ్యాట్రిక్‌’ విజయం.. దిగ్గజ ఆటగాడితో సంయుక్తంగా

Published Fri, Aug 19 2022 7:37 AM | Last Updated on Fri, Aug 19 2022 7:39 AM

Praggnanandhaa Hat-trick Win Leads 1st Palce Chess Champion Carlsen - Sakshi

మయామి: ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ‘హ్యాట్రిక్‌’ విజయం సాధించాడు. తొలి రెండు రౌండ్లలోనూ మేటి ర్యాంకర్లకు చెక్‌ పెట్టిన ఈ టీనేజ్‌ సంచలనం గురువారం జరిగిన మూడో రౌండ్‌లో 2.5–1.5తో అమెరికన్‌ గ్రాండ్‌మాస్టర్‌ హాన్స్‌ నీమన్‌పై విజయం సాధించాడు. వరుస విజయాలతో 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఇప్పుడు వరల్డ్‌ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో కలిసి 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రతీ మ్యాచ్‌లోనూ నాలుగు ర్యాపిడ్‌ గేమ్‌లు జరిగే ఈ టోర్నీలో గురువారం జరిగిన పోరులో మొదటి గేమ్‌లో ఓడినప్పటికీ భారత ఆటగాడు అద్భుత ప్రదర్శనతో పుంజుకున్నాడు. రెండు, నాలుగో గేముల్లో గెలిచాడు. మూడో గేమ్‌ డ్రా అయ్యింది. తాజా విజయంతో అతని ఖాతాలో మరో రూ. 5.94 లక్షలు (7500 డాలర్లు) ప్రైజ్‌మనీ జమ అయ్యింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement