కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్‌ ప్రపంచ రికార్డు | 2 YO Konda Shreyansh Murali Krishna Patel World Record In Chess | Sakshi
Sakshi News home page

కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్‌ ప్రపంచ రికార్డు

Apr 7 2026 6:26 PM | Updated on Apr 7 2026 7:59 PM

2 YO Konda Shreyansh Murali Krishna Patel World Record In Chess

అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిగా కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ నిలిచాడు. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. 

రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన  కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ నిలిచాడు. 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడు.

జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.

శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డ్ సాధించి, భరతమాత ముద్దు బిడ్డగా, అపార మేధస్సు కలిగిన స్వామి వివేకానందునిగా అవతరించాడని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు.  మరోవైపు.. తన మనవడి ప్రతిభను చూసి మంత్రి సురేఖ మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, శ్రీయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.

కాగా రాయ్ చెస్ అకాడమీ తరఫున  క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొండా శ్రేయాన్ష్ పటేల్‌కు ట్రోఫీలు, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్‌ను శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ పొందనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement