ఇండియా-ఇంగ్లండ్ వరల్డ్‌కప్ మ్యాచ్ జరుగుతుండగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. పాక్ వేదికగా జరిగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అర్హత ప్రమాణాలకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. వరల్డ్‌కప్ 2023 లీగ్ దశ తర్వాత టాప్-7లో నిలిచే జట్లు 8 జట్లు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయని ఐసీసీ ప్రకటించింది.
ఐసీసీ చేసిన ఈ ప్రకటనతో ప్రస్తుత వరల్డ్‌కప్‌కు అర్హత సాధించని ఐసీసీ సభ్య దేశాలు వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమకు ఈ విషయంపై కనీస సమాచారం కూడా లేదని అసంతృప్తి వెల్లగక్కాయి. వరల్డ్‌కప్ లీగ్ దశ తర్వాత ఆతిథ్య పాక్ టాప్-7 జట్లలో ఉంటే అప్పుడు ఎనిమిదో జట్టును ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనే అంశంపై ఐసీసీ క్లారిటీ ఇవ్వలేదు.
కాగా, ఐసీసీ ఆథ్వర్యంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటివరకు ఎనిమిది ఎడిషన్ల పాటు సాగింది. 1998లో మొదలైన ఈ టోర్నీ ఐదు ఎడిషన్ల పాటు రెండేళ్లకు ఓసారి చొప్పున జరిగింది. ఆతర్వాత మధ్యమధ్యలో బ్రేక్‌లు పడుతూ ఇంగ్లండ్‌లో జరిగిన 2017 ఎడిషన్ వరకు సాగింది. ఈ ఎడిషన్‌లో పాక్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో పాక్.. టీమిండియాను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment