మూడో టీ20కు ముందు యజువేంద్ర చాహల్ ఫామ్ టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది అని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తెలిపాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన చాహల్.. ఏకంగా 75 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆకాష్ చోప్రా.. ఈ సిరీస్‌లో భారత జట్టులో లోపాలను ఎత్తి చూపాడు. "మిడిల్ ఓవర్లలో భారత్ వికెట్లు తీయకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. అనుభవం ఉన్న యుజ్వేంద్ర చాహల్ వంటి బౌలర్ కూడా విఫలవమవుతన్నాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్‌కు అతడు ఎంపిక కానప్పుడు చాలా మంది సెలెక్టర్లపై విమర్శలు వర్షం గుప్పించారు. కానీ నిజం ఏమిటంటే అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు సమర్పించకుంటున్నాడు. అందుకే టీ20 ప్రపంచకప్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఇక కటక్ టీ20లో పవర్‌ప్లేలో మూడు వికెట్లు పడగొట్టి భారత్‌కు భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ మిడిల్ ఓవర్లలో మిగతా బౌలర్లు కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించారు. స్పిన్నర్లు తీవ్రంగా విఫలమయ్యారు. చాహల్, అక్షర్ పటేల్ తలా వికెట్ మాత్రమే సాధించారు. మిడిల్ ఓవర్లలో బౌలర్లు రాణిస్తానే జట్టు విజయం సాధిస్తుంది" అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. భారత జట్టులో మూడు మార్పులు..!
Comments
Please login to add a commentAdd a comment