Indian Racing League 2022: Akhil Rabindra wins Drivers Championship - Sakshi
Sakshi News home page

Indian Racing League: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ విజేత అఖిల్‌ 

Published Mon, Dec 12 2022 8:00 AM | Last Updated on Mon, Dec 12 2022 11:27 AM

AKhil Ravindra Won Indian Racing League Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)లో హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ జట్టుకు చెందిన అఖిల్‌ రవీంద్ర డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించాడు. మొత్తం ఆరు జట్లు పోటీపడిన ఈ లీగ్‌ ఆదివారం ముగిసింది. ఈ లీగ్‌లో అఖిల్‌ మొత్తం 147 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గాడ్‌స్పీడ్‌ కొచ్చి జట్టుకు చెందిన అలిస్టర్‌ యూంగ్‌ (142 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు.

ట్యాంక్‌బండ్‌ రోడ్‌లోని హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో ఆదివారం జరిగిన రేసుల్లో అలిస్టర్‌ యూంగ్, నిఖిల్‌ బోరా విజేతలుగా నిలిచారు. 445.5 పాయింట్లతో గాడ్‌స్పీడ్‌ కొచ్చి జట్టు టీమ్‌ టైటిల్‌ను సొంతం చేసుకోగా... 397 పాయింట్లతో హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రన్నరప్‌గా నిలిచింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement