దుబాయ్: ఈ సీజన్ ఐపీఎల్‌లో మరో కొత్త ముఖం చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికన్ క్రికెటర్ అలీఖాన్ ఐపీఎల్ ఆడేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడటానికి డీల్ కుదుర‍్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 29 ఏళ్ల అలీఖాన్ యూఎస్‌ఏ తరఫున ఆడుతున్నాడు. ఫాస్ట్‌బౌలర్‌గా తన మార్కు ఆటతో మెరుస్తున్న అలీఖాన్..కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ట్రిన్‌బాగ్ నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్ సీపీఎల్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఎనిమిది వికెట్లు సాధించాడు. కాగా, ఈ సీజన్ ఐపీఎల్ నుంచి కేకేఆర్ ఆటగాడు హారీ గర్నీ భుజం గాయం కారణంగా వైదొలగగా, అతని స్థానంలో అలీఖాన్‌ను తీసుకోవడానికి కేకేఆర్ సమాయత్తమైంది. గత ఐపీఎల్ సీజన్‌లోని అలీఖాన్ తీసుకోవాలని కేకేఆర్ భావించినా అది కుదరలేదు. ఈసారి అతన్ని తీసుకోవడానికి కేకేఆర్ యాజమాని షారుక్ ఆసక్తికనబరుస్తున్నాడు. ఒకవేళ అలీఖాన్ ఐపీఎల్ ఆడితే మాత్రం అమెరికా నుంచి ఈ లీగ్ ఆడిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు.
బ్రేవో పట్టుకొచ్చాడు..
2018 గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో మెరిసిన అలీఖాన్.. కొంతమంది క్రికెటర్ల దృష్టిలో పడ్డాడు. ప్రధానంగా అలీఖాన్ ఆట డ్వేన్ బ్రేవోను ఆకర్షించింది. దాంతో సీపీఎల్‌కు పట్టుకొచ్చాడు బ్రేవో. ఆ సీజన్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడిన అలీఖాన్.. 12 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు సాధించాడు. ఫలితంగా ఆ సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ట్రినిబాగ్ నైట్‌రైడర్స్‌కు ఆడిన ఆడి అలీఖాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది నైట్‌రైడర్స్ టైటిల్ గెలవడంలో కూడా అలీఖాన్ మెరిశాడు. సెయింట్ లూసియితో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అలీఖాన్ రెండు వికెట్లు సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్ కోసం గత ఏడాది చివర్లో జరిగిన వేలంలో అలీఖాన్ తన పేరును రిజస్టర్ చేయించుకున్నాడు. దాంతో కేకేఆర్‌తో ఒప్పందం చేసుకోవడానికి అలీఖాన్‌కు మార్గం సుగమం అయ్యింది.(చదవండి: ఐపీఎల్.. బలాబలాలు తేల్చుకుందాం!)
Comments
Please login to add a commentAdd a comment