ప్రతిష్టాత్మక టోర్నీల్లో పతకాలు గెలిచిన పూసర్ల వెంకట సింధుకు ఎందుకనో ఆల్ ఇంగ్లండ్ కలిసిరావడం లేదు. ఈ ఏడాదీ ఆమె పతకం లేకుండానే నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ సింధు 19–21, 21–16, 17–21తో సయాక టకహషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. సైనా నెహ్వాల్ 14–21, 21–17, 17–21తో రెండో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ మాజీ ప్రపంచ నంబర్‌వన్ ఈ మ్యాచ్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకుంది.
మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రీ–ట్రెసా జాలీ తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్‌లో దూసుకెళుతుండగా 18–21, 19–14 స్కోరువద్ద ఆరో సీడ్ ప్రత్యర్థి జోడీ గ్రేసియా–అప్రియని (ఇండోనేసియా) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో భారత జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–7, 21–7తో మార్క్ లామ్స్‌ఫుజ్–మార్విన్ సీడెల్ (జర్మనీ) ద్వ యంపై ఏకపక్ష విజయాన్ని సాధించింది. కేవలం 27 నిమిషాల్లోనే భారత జంట మ్యాచ్‌ను ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment