అబుదాబి: జోఫ్రా ఆర్చర్.. ఇంగ్లండ్ జట్టు ప్రధాన పేసర్. గతేడాది వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకోవడంతో పాటు ఆశించిన స్థాయిలోనే రాణించాడు ఆర్చర్. అయితే ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పాత ట్వీట్‌లు అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తించాయి. ‘6 బంతులు16 పరుగులు’ అని చేసిన ట్వీట్ ప్రపంచకప్ అనంతరం చర్చకు దారీ తీసింది. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ సూపర్ ఓవర్‌లో 15 పరుగులు చేసింది.. న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అతనికి సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? అనే సందేహాన్ని కలిగించాయి. అటు తర్వాత ఐర్లాండ్‌తో నాలుగు రోజుల టెస్ట్ సందర్భంగా కూడా మరోసారి అతని పాత ట్వీట్‌లు చర్చనీయాంశమయ్యాయి. ఇలా అతను చేసిన చాలా ట్వీట్లే వైరల్‌గా మారాయి.(రప్ఫాడించిన రాజస్తాన్ )
ఎప్పుడో ఫలాన అంటూ ట్వీట్ చేయడం, అది మన కళ్ల ముందు తాజాగా కనిపించడం జరుగుతూ ఉండటమే కాకుండా వైరల్‌గా మారడం మనం చూస్తున్నాం. ఆర్చర్‌లో టైమ్ మిషీన్ ఏమైనా ఉందా? అనే అనుమానం మరొకసారి కల్గింది. ప్రస్తుత ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ రాజస్తాన్ తరఫున ఆడుతున్న ఆర్చర్ ఒక అద్భుతమైన క్యాచ్‌ను పట్టాడు. కార్తీక్ త్యాగి వేసిన 11 ఓవర్ నాల్గో బంతిని భారీ షాట్ ఆడిన ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్.. బౌండరీ లైన్ కు కాస్త ముందు ఆర్చర్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ క్యాచ్‌ను పట్టడం కష్టసాధ్యమనుకున్న తరుణంలో ఆర్చర్ దాన్ని అందుకుని శభాష్ అనిపించాడు.
ఆరేళ్ల క్రితం ఐపీఎల్ క్యాచ్ మాట
అసాధారణమైన క్యాచ్‌లను పట్టడం క్రికెట్‌లో ఒకటైతే, ఈ విషయాన్ని ఆర్చర్ దాన్ని ముందుగా చెప్పడమే ఆసక్తికరంగా మారింది. 2014లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అది ‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’ అని ఆర్చర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అప్పటికి ఆర్చర్ అంతర్జాతీయ అరంగేట్రమే జరగలేదు. గతేడాది ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన ఆర్చర్.. 2018లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆర్చర్ అదరగొట్టాడు. రెండేళ్ల క్రితం ముంబై ఇండియన్స్‌తో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో ఆర్చర్ మూడు వికెట్లు సాధించి శభాష్ అనిపించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టుకు ఆడటమే కాకుండా ప్రధాన పేసర్‌గా మారిపోయాడు. ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆర్చర్ చేసే ట్వీట్లే అందర్నీ ఆలోచింప చేస్తున్నాయి. ఆర్చర్ ఏమైనా మాయలు ఉన్నాయా.. అని అభిమానులు తమలో తాము చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో జరగబోయేది ఆర్చర్‌కు ముందే ఎలా తెలుస్తుంది అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ భారీ విజయాన్ని సాధించింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సునాయాసంగా ఛేదించింది. తమ బ్యాటింగ్‌లో పవర్ చూపెట్టిన రాజస్తాన్.. ముంబై ఇండియన్స్‌ను రప్ఫాడించింది. బెన్ స్టోక్స్(107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్(54 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)లు చెలరేగిపోవడంతో రాజస్తాన్ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.ఈ జోడి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రాజస్తాన్ అలవోకగా జయకేతనం ఎగురవేసింది.
— Jofra Archer (@JofraArcher) May 19, 2014
Comments
Please login to add a commentAdd a comment