Photo Credit: Twitter
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈతరం ఫుట్‌బాల్ శకంలో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన మెస్సీ సోమవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో 207 మ్యాచ్‌లాడిన మెస్సీ 125 గోల్స్ సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆల్ టైమ్ గోల్ స్కోరర్స్ జాబితాలో మెస్సీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇటీవలే ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో అర్జెంటీనా సారథిగా అన్నీ తానై జట్టును నడిపించాడు. ఫిఫా చరిత్రలోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కిన మెస్సీ జట్టును ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. కానీ కీలకమైన ఫైనల్లో మెస్సీ గోల్ చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా స్పెయిన్ 1-0తో అర్జెంటీనాను ఓడించి ఫిఫా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
అప్పటి నుంచే మెస్సీ అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే మెస్సీ మాత్రం వచ్చే ఫిఫా వరల్డ్‌కప్ వరకు ఆడకపోయినప్పటికీ, కొంతకాలం పాటు జట్టు తరఫున ఆడాలని తొలుత భావించాడు. కానీ తన రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించిన మెస్సీ సోమవారం గుట్టుచప్పుడు కాకుండా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మెస్సీ తన దేశానికి 2022 ఫిఫా ప్రపంచ కప్‌తో పాటు 2021, 2024 రెండు కోపా అమెరికా టైటిళ్లను అందించాడు.
“అర్జెంటీనా జెర్సీ కోసం తన శక్తినంతా ధారపోశాను. జట్టుతో కలిసి దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాను. అర్జెంటీనా ప్రజలను గర్వపడేలా చేయడం తనకు ఎప్పుడూ ఆనందమేజ్ఞ. ఈ నిర్ణయం నా హృదయాన్ని ఎంతో బాధించింది. జాతీయ జట్టులో తనకు ఇక ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. యువ ఆటగాళ్లు జాతీయ జట్టులోకి రావడానికి ఇదే సరైన సమయం.
20 ఏళ్లుగా అందించిన ప్రేమ, అభిమానానికి అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు. ఇకపై జాతీయ జట్టును బయట నుంచి అభిమానించే సాధారణ అభిమానిగా ఉంటాను. కుటుంబం, కోచ్లు, సహచరులు, జట్టు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. జాతీయ జట్టుతో గడిపిన అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. సహచరులతో కలిసి అభిమానులకు కలలలాంటి క్షణాలు అందించగలిగినందుకు గర్వంగా ఉంది. నన్ను అర్జెంటీనియన్గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు" అని తన రిట్మెర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.

🚨🚨🚨 BREAKING:
LIONEL MESSI BECOMES THE FIRST PLAYER EVER TO RETIRE FROM THE NATIONAL TEAM TWICE.pic.twitter.com/B37oHMhpNx— The CR7 Timeline (@TimelineCR7) August 31, 2026
Read: సిరీస్ ఓటమి; పాక్ జట్టులో మార్పులు.. కోచ్ పదవి ఊస్ట్!


