టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. గతేడాది డిసెంబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకొని టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆ సిరీస్‌లో ఆడిన ప్రతీ ఆటగాడికి స్వదేశంలో ఘన స్వాగతం కూడా లభించింది. కాగా తాజాగా అశ్విన్.. స్మిత్‌ను ఔట్ చేసేందుకు ఆరు నెలలపాటు రీసెర్చ్ చేశానంటూ తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికాలో ఉన్న అశ్విన్ ఒక చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
చదవండి: అతనిలో ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుంది.. హైదరబాదీ పేసర్‌ని ఆకాశానికెత్తిన సచిన్
ఆస్ట్రేలియా పర్యటన ఆరంభం కాకముందే ఆరు నెలల ముందు నుంచి స్మిత్‌ను ఔట్ చేయడంపై రీసెర్చీ చేశాను. అతను ఆస్ట్రేలియా జట్టులో కీలక బ్యాట్స్‌మన్.. అందుకే అతనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టా. దీనికోసం స్మిత్ ఇంతకముందు మ్యాచ్‌లు ఆడిన ఫుటేజీలను తెప్పించుకొని బ్యాటింగ్ శైలిని గమినించాను. అతని ఆలోచన విధానాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. స్మిత్ బ్యాటింగ్ టెక్నిక్ ఎక్కువగా హ్యాండ్ మూమెంట్‌పై ఆధారపడి ఉంటుంది. దానిమీద అంచనా వేసుకొని బౌలింగ్ చేశాను.. అతని వికెట్ సాధించాను. అని పేర్కొన్నాడు.
ఇక డిసెంబర్ 26 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో అశ్విన్ ముంగిట అరుదైన రికార్డు ఉంది.ఇప్పటివరకు టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్ మరో 8 వికెట్లు తీస్తే టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్‌ను(433 వికెట్లు) అందుకోనున్నాడు. ఇక టీమిండియా తరపున టెస్టుల్లో 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
చదవండి: IND Vs SA: ఏడుసార్లు పర్యటిస్తే 9 మందికి మాత్రమే సాధ్యమైంది!
Comments
Please login to add a commentAdd a comment